Vijay Chandra: పార్వతీపురం ఎమ్మెల్యే ఇంట్లో వాలంటీర్ల సమావేశం... అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర

Parvathipuram TDP candidate Vijay Chandra tries to intercept volunteers meeting in MLA Jogarao residence

  • టీడీపీ శ్రేణుల రాకను గమనించి వెళ్లిపోయేందుకు యత్నించిన వాలంటీర్లు
  • సెల్ ఫోన్లలో చిత్రీకరించిన టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర అనుచరులు
  • ఫోన్లు లాగేసుకున్న వైసీపీ నేతలు 

పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే జోగారావు నివాసంలో వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించగా, ఎన్డీయే కూటమి టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. జోగారావు నివాసంలో వాలంటీర్ల సమావేశంపై సమాచారం అందుకున్న విజయ్ చంద్ర... జోగారావు ఇంటికి వెళ్లారు. 

టీడీపీ శ్రేణుల రాకను గమనించిన వాలంటీర్లు అక్కడ్నించి వెళ్లిపోయారు. వాలంటీర్లు వెళుతున్న దృశ్యాలను విజయ్ చంద్ర అనుచరులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. అయితే, విజయ్ చంద్రను, ఆయన అనుచరులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విజయ్ చంద్ర అనుచరుల సెల్ ఫోన్లను లాక్కున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. 

ఈ విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు, వారిని అక్కడ్నించి పంపించివేశారు. వైసీపీ నేతలు లాక్కున్న ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News