Chiranjeevi: రామ్ చరణ్ కు డాక్టరేట్ పట్ల ఓ తండ్రిగా గర్విస్తున్నా: చిరంజీవి

Chiranjeevi responds on doctorate for Ram Charan

  • రామ్ చరణ్ కు డాక్టరేట్ అందించిన వేల్స్ విశ్వవిద్యాలయం 
  • నేడు చెన్నైలో వేల్స్ వర్సిటీ స్నాతకోత్సవం
  • కుమారుడికి అరుదైన గౌరవం పట్ల పొంగిపోతున్న చిరంజీవి

ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

"తమిళనాడులోని సుప్రసిద్ధ విద్యాసంస్థ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందించడం నన్ను భావోద్వేగాలకు గురిచేసింది, అదే సమయంలో ఓ తండ్రిగా గర్వపడేలా చేసింది. నిజంగా ఇది ఉత్తేజభరితమైన క్షణం. బిడ్డలు తమను మించిపోయేలా విజయాలు సాధిస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన సంతోషం కలుగుతుంది. రామ్ చరణ్ గొప్ప నిలకడతో ముందుకు, మున్ముందుకు వెళుతున్నాడు. లవ్యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్" అంటూ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

More Telugu News