: తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే: అజిత్ సింగ్
2014 ఎన్నికల ద్వారా కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అజిత్ సింగ్ అన్నారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తెలంగాణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అయితే, ఎన్డీఏ కూటమి ఈ సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయనే, తెలంగాణ ఏర్పాటు యూపీఏకే సాధ్యమని ఆయన తెలిపారు. ఢిల్లీ వెళ్లగానే తెలంగాణ అంశంపై సోనియాను కలుస్తానని అజిత్ సింగ్ చెప్పారు.