Preethi Pagadala: మా పేరెంట్స్ నాతో చెప్పిన మాట అదొక్కటే: ఇన్ స్టా సెన్సేషన్ ప్రీతి పగడాల

Preethi Pagadala Special

  • సోషల్ మీడియాలో సందడి చేసే ప్రీతి పగడాల
  • పతంగ్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ
  • త్వరలో విడుదల కానున్న సినిమా 
  • ఇతర భాషల్లోనూ సినిమాలు చేయాలనుందని వెల్లడి 


ప్రీతి పగడాల .. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ పేరును గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. రీల్స్ చేస్తూ ఆమె ఎప్పటికప్పుడు యూత్ కి టచ్ లోనే ఉంటూ ఉంటుంది. అమెరికాలో పెరిగిన ప్రీతి, తెలుగు .. ఇంగ్లిష్ కలిపి మాట్లాడే ముద్దు ముద్దు మాటలే ఆమెకి ఇంత క్రేజ్ రావడానికి కారణమయ్యాయని చెప్పచ్చు. 'పతంగ్' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది, తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను పంచుకుంది. 

"నేను .. మా పేరెంట్స్ అమెరికాలోనే ఉంటాము. అప్పుడప్పుడు ఇండియాలోని మా నాయనమ్మ వాళ్లింటికి వస్తుంటాను. ఆ మధ్య మా కజిన్ పెళ్లికోసమని ఇక్కడికి వచ్చాను. అలా వచ్చినప్పుడే 'పతంగ్' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. అంతా కొత్తవారే కలిసి ఈ సినిమాను చేస్తున్నారు. అందువలన నాకు భయం అనిపించలేదు. ఈ సినిమా తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్టుల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ 'పతంగ్' రిలీజ్ తరువాత చూద్దామనే ఆలోచనలో ఉన్నాను" అని చెప్పింది. 

"  నేను ఎవరిని పడితే వాళ్లను నమ్మేస్తూ ఉంటాను. అందువలన నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు మా అమ్మా .. నాన్న 'అందరినీ నమ్మకు .. జాగ్రత్తగా ఉండు' అని చెప్పారు. అదృష్టం కొద్దీ ఇంతవరకూ తారసపడిన వాళ్లంతా మంచివారే. ఇతర భాషల్లోను నటించాలని ఉంది. అయితే ఎవరిని ఎలా అప్రోచ్ కావాలనేది తెలియదు .. ఆ విషయంపై దృష్టిపెడతాను" అని అంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన 'పతంగ్' సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Preethi Pagadala
Actress
Praneeth
Pathang Movie
  • Loading...

More Telugu News