Bhagyasree Borse: కుర్రాళ్ల లోకానికి మరో కలల రాణి .. భాగ్యశ్రీ బోర్సే!

Bhagyasree Borse Special

  • మోడలింగ్ లో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే 
  • 'యారియాన్ 2'తో బాలీవుడ్ కి పరిచయం 
  • 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఎంట్రీ 
  • విజయ్ దేవరకొండ జోడీగా ఛాన్స్ 
  • టాలీవుడ్ లో పెరుగుతున్న జోరు


అందం ఎక్కడ ఉన్నా ఇప్పుడది ప్రపంచానికి పరిచయం కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అందం ఎప్పుడూ అందమైనదే .. అందువలన దానిని అభిమానించేవారు .. ఆరాధించేవారు ఎక్కువగానే ఉంటారు. సోషల్ మీడియాలో అందగత్తెల ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. వెండితెరకి పరిచయమైన కొత్త బ్యూటీలను గురించి తెలుసుకునే పనిలోనే చాలామంది ఉన్నారు. అలాంటి వారందరి దృష్టిని ఆకర్షిస్తున్న సుందరిగా ఇప్పుడు 'భాగ్యశ్రీ బోర్సే' కనిపిస్తోంది. 

భాగ్యశ్రీ బోర్సే .. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణి. సినిమాల పరంగా చూసుకుంటే తొలి అడుగులు ఈ మధ్యనే మొదలయ్యాయి. పూణెకి చెందిన ఈ మల్లెతీగ మోడలింగ్ రంగంలో తన జోరు చూపిస్తోంది. చాలా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తూ వెళుతోంది. అలా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ, 'యారియాన్ 2' లో మెరిసింది. అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం తడబడని ఈ అమ్మాయి, అక్కడి ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అందువలన ఆ వైపు నుంచి ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి హరీశ్ శంకర్ అవకాశం ఇచ్చాడు. రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాలో ఆమె కథానాయికగా అందాల సందడి చేయనుంది. ఇక విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమాలో కథానాయికగా ఆమెనే తీసుకున్నారనే టాక్ వచ్చిన దగ్గర నుంచి ఆమె గురించి యూత్ మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. మిగతా యంగ్ హీరోలు కూడా తమ తాజా ప్రాజెక్టుల కోసం ఆమె పేరును సిఫార్స్ చేస్తున్నట్టు వినికిడి. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన  రూపం .. హాట్ లుక్స్ ఉన్న ఈ బ్యూటీ, ఇక్కడ తన హవాను కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి మరి! 

More Telugu News