Vijay Sai Baba Temple: తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్

Tamil Star vijay constructs Saibaba Temple as per his mother shobhas wishes

  • విజయ్ సాయిబాబా గుడి కట్టించారన్న వార్త నిజమేనన్న ఆయన తల్లి శోభ
  • సాయిబాబా గుడి నిర్మించాలని తనకు ఎంతో కాలంగా ఉండేదని వెల్లడి
  • ప్రతి గురువారం తాను అక్కడికి వెళుతుంటానన్న శోభ
  • పేదలకు ఇకపై నిత్యాన్నదానం చేసే యోచనలో ఆలయ కమిటీ

తన తల్లి చిరకాల కోరిక మేరకు తమిళ సినీనటుడు విజయ్.. సాయిబాబా గుడి కట్టించారు. ఈ విషయాన్ని ఆయన తల్లి శోభ స్వయంగా తెలిపారు. తన కోసం విజయ్ గుడి కట్టించాడంటూ ప్రచారం అవుతున్న వార్త నిజమేనని అన్నారు. ‘‘సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్‌తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికి వస్తుంటా. స్వామి వారిని దర్శించుకుంటా. విజయ్‌ కూడా పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు’’ అని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే, పేదల కోసం ఇక్కడ ప్రతి రోజూ అన్నదానం చేసే యోచనలో ఉన్నామని ఆలయ కమిటీ తెలిపింది. 

ఇటీవల విజయ్ చెన్నైలోని ఓ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పూజారులతో కలిసి ఫొటోలు దిగారు. ఇది నెట్టింట వైరల్‌గా మారడంతో పాటూ ఆలయాన్ని విజయ్ కట్టించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో, విజయ్ తల్లి శోభ ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. 

ఇక విజయ్ ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీలో నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

More Telugu News