LK Advani: అద్వానీని కలిసి అభినందనలు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

Bandaru Dattatreya meets LK Adavni

  • భారతరత్న వరించినందుకు అభినందనలు తెలిపిన దత్తాత్రేయ
  • ఢిల్లీలోని అద్వానీ ఇంట్లో కలిసిన హర్యానా గవర్నర్
  • భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన దత్తాత్రేయ

హర్యానా ముఖ్యమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిశారు. భారత అత్యున్నత పురస్కారం భారతరత్న వరించినందుకు గానూ అద్వానీని కలిసి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను దత్తాత్రేయ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

అద్వానీ దేశానికి చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు గాను భారత ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలోని మహోన్నత వ్యక్తిని కలవడం తనకు చాలా సంతోషమని పేర్కొన్నారు. అద్వానీతో తాను వివిధ అంశాలపై చర్చించానని... గత జ్ఞాపకాలను పంచుకున్నామని పేర్కొన్నారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

LK Advani
BJP
Bharat Ratna
  • Loading...

More Telugu News