Sayaji Shinde: టాలీవుడ్ విలన్ సాయాజీ షిండే కు యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు

Sayaji Shinde hospitalised after he suffered with chest pain

  • ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన సాయాజీ షిండే
  • ఈసీజీలో స్వల్ప మార్పులు... యాంజియోగ్రఫీ సిఫారసు చేసిన డాక్టర్లు
  • గుండె కుడివైపున 99 శాతం బ్లాక్స్ ఉన్నట్టు వెల్లడి

టాలీవుడ్ లో విలన్ పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సాయాజీ షిండేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. సాయాజీ షిండే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలోని సతారాలో నిన్న ఛాతీలో నొప్పికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈసీజీలో మార్పులు కనిపించాయి. దాంతో, యాంజియోగ్రఫీ పరీక్షకు వైద్యులు సిఫారసు చేశారు. సాయాజీ షిండేకు గుండె కుడివైపున 99 శాతం బ్లాక్స్ ఉన్నట్టు ఆ పరీక్షలో వెల్లడైంది. దాంతో ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. 

ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.

More Telugu News