Pawan Kalyan: డాక్టరేట్ అందుకుంటున్న రామ్ చరణ్ కు నా అభినందనలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan appreciates Ram Charan on being conferred with doctorate for Vels University

  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ
  • రేపు చెన్నైలో స్నాతకోత్సవం
  • రామ్ చరణ్ కు డాక్టరేట్ దక్కడం సంతోషాన్ని కలిగించిందన్న పవన్ కల్యాణ్ 

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం తెలిసిందే. రేపు (ఏప్రిల్ 13) చెన్నైలో జరిగే వేల్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ఈ డాక్టరేట్ అందుకోనున్నారు.

దీనిపై జనసేనాని, రామ్ చరణ్ బాబాయి పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్ చరణ్ కు నా అభినందనలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

"చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషం కలిగించింది. రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. 

గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ వపన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News