Chandrababu: చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. హాజరైన పవన్ కల్యాణ్, పురందేశ్వరి

Chandrababu Pawan Kalyan Purandeswari meeting
  • చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం
  • ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహరచనపై చర్చ
  • కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా చర్చించనున్న నేతలు
ఎపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Daggubati Purandeswari
BJP
NDA

More Telugu News