Nara Lokesh: నారా లోకేశ్ ఫోన్ హ్యాకింగ్ కు ప్రయత్నం... అలర్ట్ మెసేజ్ పంపిన ఆపిల్

Apple sent security alert for Nara Lokesh

  • ఇటీవల కాలంలో భారత్ లో ప్రముఖుల ఐఫోన్లకు స్పైవేర్ల ముప్పు
  • ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అలర్ట్ లు పంపిస్తున్న ఆపిల్
  • నారా లోకేశ్ ఐఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వెల్లడి
  • వైసీపీపై మండిపడుతున్న టీడీపీ నేతలు

ఇటీవల కాలంలో భారత్ లో ప్రముఖుల ఐఫోన్లలో స్పైవేర్లు చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆపిల్ అలర్ట్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కూడా ఆపిల్ నుంచి ఈ తరహా అలర్ట్ మెసేజ్ వచ్చింది. నారా లోకేశ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసేందుకు, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుర్తించామని ఆపిల్ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. నారా లోకేశ్ ఈ మేరకు ఫోన్ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. 

ఈ విషయాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది వైసీపీ పనే అని మండిపడుతున్నారు. లోకేశ్ ఫోన్ ను వైసీపీ ప్రభుత్వమే ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం, సీఈవో దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.

More Telugu News