Romance In Plane: విమానంలో రొమాన్స్.. నాలుగు గంటలపాటు చెలరేగిపోయిన జంట!

Romance In Flight For Four Hours In US

  • అమెరికాలో ఘటన
  • ఖాళీగా ఉన్న రెండు సీట్లను అనుకూలంగా మార్చుకున్న జంట
  • ప్రయాణికులకు నాలుగు గంటల సినిమా 
  • వైరల్ అవుతున్న ఫొటోలు

మెట్రో రైళ్లు, బైకులు, పార్కులు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా ఇటీవల ప్రేమ జంటలు చెలరేగిపోతున్నాయి.  సరససల్లాపాల్లో మునిగితేలుతున్నాయి. ఎవరేం అనుకుంటే మాకేం అన్నట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి విమానం కూడా వచ్చి చేరింది. విమానంలో ప్రయాణిస్తున్న జంట తమపక్కనే రెండు సీట్లు ఖాళీగా ఉండడాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. అంతే, తాము విమానంలో ఉన్నామని, తమతోపాటు పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారన్న ఇంగితాన్ని మర్చిపోయి ఎంచక్కా రొమాన్స్‌లో మునిగిపోయారు. సీట్లపై పడుకుని దొర్లుతూ నానా హంగామా చేశారు. 

దాదాపు నాలుగు గంటలపాటు తోటి ప్రయాణికులకు మంచి ‘రస’వత్తర సినిమా చూపించారు. వారు శృంగార మైకంలో పూర్తిగా మునిగిపోవడంతో తోటి ప్రయాణికులు కూడా పట్టించుకోకుండా వారి పనిలో వారు మునిగిపోయారు. కొందరు ప్రయాణికులు మాత్రం వారి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. అమెరికాలోనే జరిగింది కానీ, ఎప్పుడు? ఏ విమానంలో జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.

Romance In Plane
America
USA
Couple

More Telugu News