KCR: కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

Double bedroom beneficiaries protest at KCR farm house

  • కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత
  • ఆందోళనకు దిగిన గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు
  • ఒక్కరికి కూడా ఇంటిని అందించలేదని ఆగ్రహం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1,100 మంది పేర్లను తీశారని... వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, ఒంటేరులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగామని... ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో ఉన్న తాము ఏం పాపం చేసుకున్నామని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతో సేపు అవుతున్నా కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని చెప్పారు. గేట్ వద్ద ఉన్న తమకు ఫామ్ హౌస్ లోపల నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR
BRS
Farm House
Double Bedroom
  • Loading...

More Telugu News