Kanakamedala Ravindra Kumar: జగన్ పై పోటీ చేస్తున్న బీటెక్ రవికి తక్షణమే భద్రత పెంచాలి: కనకమేడల

Kanakamedala writes letter to EC requesting additional security to Btech Ravi

  • పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్న టీడీపీ నేత బీటెక్ రవి
  • రవికి ప్రాణహాని ఉందంటూ ఈసీకి కనకమేడల లేఖ
  • సీఐ అశోక్ రెడ్డిని బదిలీ చేయాలని విన్నపం

ఏపీలోని హైప్రొఫైల్ నియోజకవర్గాల్లో పులివెందుల ఒకటి. ఇక్కడి నుంచి ఏపీ సీఎం జగన్ పోటీ చేస్తున్నారు. జగన్ పై టీడీపీ తరపున బీటెక్ రవి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. సీఎం జగన్ పై టీడీపీ తరపున పోటీ చేస్తున్న బీటెక్ రవికి ప్రాణహాని ఉందని... ఆయనకు తక్షణమే భద్రతను పెంచాలని లేఖలో కోరారు. బీటెక్ రవిపై అక్రమ కేసులు పెట్టిన సీఐ అశోర్ రెడ్డిని బదిలీ చేయాలని విన్నవించారు. అశోక్ రెడ్డిది ఫంక్షనల్ పోస్ట్ అని... ఫంక్షనల్ పోస్టులపై ఈసీ అభ్యంతరం తెలపలేదంటున్నారని విమర్శించారు. బీటెక్ రవికి ప్రాణహాని లేదని చెప్పడం అవాస్తవమని అన్నారు.

More Telugu News