: తాజా ఎంసెట్ మెడికల్ కోర్సు అభ్యర్ధులకు శుభవార్త
రాష్ట్రానికి మరో వంద ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 200 సీట్లున్న ఉస్మానియా యూనివర్సిటీకి 50 సీట్లు అదనంగా మంజూరు కాగా, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలకు 50 అదనపు సీట్లు కేటాయిస్తూ భారత వైద్య మండలి(ఎంసీఐ) నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్యవిద్యాశాఖాధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇంతవరకూ 200 సీట్లు ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు 250 కి పెగనున్నాయి. తాజాగా మెడిసిన్ ర్యాంకులు సాధించిన విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.