RBI: అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై అనిశ్చితి

RBI wrote Jasti Anjaneyulu on its regional office in Amaravati

  • అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై పీఎంవోకు లేఖ రాసిన జాస్తి ఆంజనేయులు
  • ఆ లేఖను ఆర్బీఐకి పంపింన పీఎంవో అధికారులు
  • తాజాగా ఆర్బీఐ నుంచి జాస్తి ఆంజనేయులుకు లేఖ

ఏపీ రాజధాని అమరావతిలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్) కార్యాలయం ఏర్పాటుపై సందిగ్ధత ఏర్పడింది. రాజధాని ఏదో ఏపీ ప్రభుత్వం ఇంకా తేల్చలేదని ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమీత్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరుకు చెందిన జాస్తి ఆంజనేయులుకు సుమీత్ లేఖ రాశారు. 

అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై జాస్తి ఆంజనేయులు గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖను పీఎంవో అధికారులు ఆర్బీఐకి పంపించారు. ఆ లేఖకు ఆర్బీఐ అధికారులు బదులిచ్చారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే స్పష్టత లేదని ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమీత్ ఆ లేఖలో వెల్లడించారు. 

ఆర్బీఐ తనకు లేఖ రాయడం పట్ల జాస్తి ఆంజనేయులు స్పందించారు. 2016లో అమరావతిలో ఆర్బీఐకి 11 ఎకరాలు కేటాయించారని, కేంద్ర ప్రభుత్వ మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించారని వెల్లడించారు.

More Telugu News