: రూపాయి తరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?


డాలర్ తో రూపాయి మారకం విలువ క్రమంగా క్షీణిస్తూనే ఉంది. ప్రస్తుతం 57కు దగ్గర్లో ఉంది. ఇది 11 నెలల కనిష్ఠస్థాయి. వాస్తవానికి రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల కొందరికి నష్టమయితే, మరికొందరికి లాభదాయకం. అదెలానో ఇప్పుడు చూద్దాం.

రూపాయి విలువ క్షీణిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రియం అవుతాయి. ఎందుకంటే, ఆరు నెలల క్రితం ఒక డాలర్ కు 52 రూపాయిలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పడు 57 చెల్లించాలి మరి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. ఇక బంగారం కూడా దిగుమతి చేసుకునేదే గనుక దాని రేటూ పెరిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది. ఫలితంగా వృద్ధికి దెబ్బ. ముడి సరుకులను దిగుమతి చేసుకునే కంపెనీల ఉత్పత్తుల వ్యయం పెరిగిపోతుంది. దాంతో అవి రేట్లు పెంచాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. విదేశాలలో చదువుకునే వారికి ఖర్చు పెరిగిపోతుంది. పెట్టుబడి దారులకు ప్రయోజనం తగ్గిపోతుంది.

ఇక రూపాయి ఎంత పడితే ఎగుమతి దారులకు అంతగానూ ఆనందమే. వారు ఎగుమతి చేసే వస్తువులకు ఎక్కువగా రూపాయిలు వచ్చి పడతాయి. అలాగే, విదేశీ ఆదాయంపై ఆధారపడే కంపెనీలకు అదనపు ప్రయోజనమే. ఇక బంధువులు, పిల్లలు అమెరికాలో సెటిలై ఇక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటే అవి అందుకునే వారికీ ఎక్కువ రూపాయలు వస్తాయి.

  • Loading...

More Telugu News