TS TET 2024: టీఎస్ టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
- ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
- ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటన
- ఈసారి టెట్ దరఖాస్తులు బాగా తగ్గిన నేపథ్యంలో నిర్ణయం
- 3 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అనుకుంటే.. ఇప్పటివరకు 2 లక్షలు కూడా దాటని వైనం
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్-2024) దరఖాస్తు గడువు పొడిగించడం జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. కానీ, ఈసారి టెట్ దరఖాస్తులు బాగా తగ్గాయి. మూడు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అనుకుంటే.. ఇప్పటివరకు రెండు లక్షలకు కూడా దాటని వైనం. అయితే, ఈసారి దరఖాస్తు రుసుము రూ. 1000 గా నిర్ణయించడం కూడా అభ్యర్థులు ఆసక్తి కనబరచకపోవడానికి ఒక కారణమని సమాచారం. ఇక 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.