Harish Rao Video: ముఖ్యమంత్రివా? లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?: రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

BRS Mla Harish Rao Fires On CM Revanth Reddy

  • కేసీఆర్ చెడ్డీ ఊడగొడతా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు
  • పదేళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇలాగేనా మాట్లాడేదని ప్రశ్న
  • హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోని పోస్ట్ చేసిన బీఆర్ఎస్    

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడమేంటని మండిపడ్డారు. ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు హరీశ్ రావు మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిరిసిల్ల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ వేదికపై డిమాండ్ చేశారని గుర్తుచేశారు. వడ్లకు రూ.500 లు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు.

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర పదజాలంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ చెడ్డీ ఊడగొడతానని రేవంత్ రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ పై ఇలాంటి భాష ఉపయోగిస్తావా అంటూ రేవంత్ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

Harish Rao Video
Viral Videos
BRS MLA
Revanth Reddy
Congress
KCR

More Telugu News