Murali Akunuri: కేసీఆర్‌కు జైలు శిక్ష పడేవరకు తెలంగాణ ప్రజలు పోరాడాలి.. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

Rtd IAS Murali Akunuri sensational comments on KCR

  • కాళేశ్వరంపై వ్యాసం రాసిన జెన్‌కో ఇంజినీర్ రఘు
  • తెలంగాణకు పట్టిన శని రాజకీయనాయకుడు కేసీఆర్ అని అభివర్ణించిన మురళి
  • అవినీతి అబద్ధాల కంపు కాళేశ్వరం ప్రాజెక్టు అన్న రిటైర్డ్ ఐఏఎస్
  • రఘు వ్యాసాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో షేర్ చేసిన మురళి 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మురళీధర్‌రావు, కాళేశ్వరానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జెన్‌కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన మురళి ప్రశంసలు కురిపించారు. చక్కని వ్యాసం రాశారంటూ రఘును ప్రశంసించిన ఆయన.. కేసీఆర్ అనే తెలంగాణకు పట్టిన శని రాజకీయ నాయకుడు, తన అహంకార మూర్ఖ వ్యవహార శైలితో కట్టిన అవినీతి అబద్ధాల కంపు కాళేశ్వరం ప్రాజెక్టు అని అభివర్ణించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలను పరిశోధించి పదునైన వ్యాసం రాశారని రఘును కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ ఆడుతున్న అబద్ధాలను నిజాలతో ఢీకొడుతూ రాశారని పేర్కొన్నారు. దీనిని ప్రతి తెలంగాణవాది చదవాలని కోరారు. ప్రజలకు విడమర్చి నిజాలు చెప్పాలన్న ఆయన దోషులైన కేసీఆర్, హరీశ్‌రావు, మురళీధర్‌రావు, సాంకేతిక అనుమతులు మంజూరు చేసిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు జైలు శిక్ష పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని మురళి కోరారు.

Murali Akunuri
TSGENCO
Raghu
Kaleshwaram Project
KCR
Harish Rao
Muralidhar Rao

More Telugu News