Sagar: మెగా మదర్ మెచ్చుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది?: 'మొగలిరేకులు' ఆర్కే నాయుడు

Sagar Interview

  • 'మొగలిరేకులు'తో మెప్పించిన సాగర్ 
  • పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు తను కేరాఫ్ అడ్రెస్
  • త్వరలో థియేటర్లకు రానున్న 'ది హండ్రెడ్'
  • మెగా ఫ్యామిలీతో గల అనుబంధాన్ని చెప్పిన హీరో   


ఆర్కే నాయుడు .. ఈ పేరును గుర్తుచేయవలసిన అవసరం లేదు .. ఎందుకంటే ఇంతవరకూ ఎవరూ 'మొగలిరేకులు' సీరియల్ లోని ఆ పాత్రను మరిచిపోలేదు. ఆ పాత్రను పోషించిన సాగర్ ను అంతేలా గుర్తుపెట్టుకున్నారు. సాగర్ ను చూడగానే అతనిది హీరో కటౌట్ అని చెప్పచ్చు. పోలీస్ ఆఫీసర్ పాత్రలలో అతను బాగా రాణిస్తాడని అప్పట్లో అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయనకి ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రలే వచ్చాయి. తన తాజాచిత్రమైన 'ది హండ్రెడ్' సినిమాలోనూ ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 

రమేశ్ కరుటూరి - వెంకీ పూషడపు - తారక్ రామ్ నిర్మాతలుగా 'ది హండ్రెడ్' సినిమా నిర్మితమైంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా పెద్ద హెల్ప్ అవుతుందని సాగర్ భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకున్నాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాగర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. 

'మొగలిరేకులు' సీరియల్ ప్రసారమవుతున్న సమయంలో, నాకు నాగబాబుగారు తారసపడ్డారు. తన మదర్ అంజనమ్మ గారికి నా నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. నన్ను ఆమె ఎంతగానో అభిమానిస్తున్నారని తెలిసి ఆశ్ఛర్యపోయాను. నా పట్ల అంజనమ్మగారి అభిమానం గురించి పవన్ కల్యాణ్ గారు అందరిలో చెప్పడం నా జీవితంలో నేను మరిచిపోలేని మరో సంఘటన. ఆ తరువాత నాగబాబుగారి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి వెళ్లినప్పుడు, అంజనమ్మగారిని కలిశాను .. ఆమె ఆశీస్సులు తీసుకున్నాను. ఆమె చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. మెగా మదర్ మెచ్చుకోవడం కంటే అదృష్టం ఏముంటుందని అనిపించింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Sagar
Nagababu
Mogalirekulu
  • Loading...

More Telugu News