Kanimozhi: మోదీ, అమిత్ షాలను చూస్తే పళనిస్వామి గజగజ వణుకుతారు: కనిమొళి

Kanimozhi fires on Palaniswami

  • మోదీ, అమిత్ షాలను పళనిస్వామి ఒక్కసారి కూడా విమర్శించలేదన్న కనిమొళి
  • కొళత్తూరుకు స్టాలిన్ చేసిందేమీ లేదని అంటున్నారని విమర్శ
  • సీఎం హోదాలో ఇక్కడకు స్టాలిన్ మూడు సార్లు వచ్చారన్న కనిమొళి

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను చూస్తే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి గజగజ వణికిపోతారని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మోదీ, అమిత్ షాలను పళనిస్వామి ఒక్కసారి కూడా విమర్శించలేదని అన్నారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నవి కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమేనని... కానీ, వీటిని అసెంబ్లీ ఎన్నికలుగా భావించి డీఎంకేను లక్ష్యంగా చేసుకుని పళనిస్వామి విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. స్టాలిన్ సీఎం అయిన తర్వాత కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పళనిస్వామి పదేపదే అంటున్నారని... వాస్తవానికి ఈ నియోజకవర్గానికి సీఎం హోదాలో స్టాలిన్ మూడు సార్లు వచ్చారని తెలిపారు. పళనిస్వామి విమర్శలకు తాము దీటుగా కౌంటర్లు ఇస్తున్నామని చెప్పారు. 

Kanimozhi
MK Stalin
DMK
Edappadi Palaniswami
AIADMK
Narendra Modi
Amit Shah
BJP
  • Loading...

More Telugu News