Bengaluru: వీడియో కాల్‌లో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.15 లక్షల దోపిడీ

Bengaluru woman lawyer made to strip by scammers posing as customs officers

  • బెంగళూరులో ఇటీవల వెలుగు చూసిన ఘటన
  • కస్టమ్స్ అధికారులమంటూ బాధితురాలికి నిందితుల ఫోన్
  • సింగపూర్‌ నుంచి డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందంటూ బెదిరింపులు
  • నార్కోటిక్స్ టెస్టు పేరిట వీడియో కాల్‌లో మహిళతో దుస్తులు తొలగింపచేసిన వైనం
  • ఈ మేరకు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులమంటూ నిందితులు ఓ మహిళా న్యాయవాదిని బెదిరించి రూ.15 లక్షలు దోచుకున్నారు. నార్కోటిక్ టెస్టుల పేరిట వీడియో కాల్‌లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఏప్రిల్ 5న కొందరు ముంబై శాఖ కస్టమ్స్ అధికారులమంటూ ఆమెకు వీడియో కాల్ చేశారు. ఆమె పేరిట సింగపూర్ నుంచి ఓ డ్రగ్స్ ప్యాకేజీ వచ్చిందని బెదిరించారు. దీంతో, బెదిరిపోయిన మహిళ నిందితులు కోరినట్టు రూ.15 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. నార్కోటిక్స్ టెస్టు పేరిట వీడియో కాల్‌లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. మరో రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఆమె వీడియోలను బయటపెడతామని బెదిరించారు.  ఆ తరువాత ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News