KTR: కేసీఆర్, కేటీఆర్ ఆదాయ, వ్యయాలపై పండితుల పంచాంగ పఠనం

KTR in Ugadhi fest in BRS bhavan

  • తెలంగాణ భవన్‌లో శ్రీక్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు
  • వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • కేసీఆర్‌ది కర్కాటక రాశి... ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయన్న పంచాంగకర్త
  • కేటీఆర్‌ది మకర రాశి అని, ఆయన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని వెల్లడి 

శ్రీక్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత పంచాంగ పఠనంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి అని, ఆయన ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయని పంచాంగకర్త తెలిపారు. కేటీఆర్‌ది మకరరాశి అని, ఆయన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని పంచాంగకర్త పేర్కొన్నారు. చేబట్టే వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు. కేటీఆర్‌కు ఈ ఏడాది మంచి అవకాశం కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని, శాంతి, సౌభాగ్యం, మతసామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

KTR
Ugadhi
BRS
Telangana
  • Loading...

More Telugu News