Raghu Rama Krishna Raju: జగన్ వచ్చి కూర్చున్నా... పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు 65 వేల మెజారిటీ ఖాయం: రఘురామకృష్ణరాజు

Raghu Rama confidant in Pawan Kalyan win at Pithapuram
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను కలిసిన రఘురామ
  • పవన్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడి
  • తాను ఎక్కడ్నించి పోటీచేసినా పవన్ ప్రచారానికి వస్తారన్న రఘురామ 
టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ... అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. 

ఇక... పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో పవన్ కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Raghu Rama Krishna Raju
Pawan Kalyan
Pithapuram
Chebrolu
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News