Pawan Kalyan: క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan participates Ugadi celebrations in Chebrolu
  • చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైనం
  • ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేశారు. అనంతరం వారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. 

క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. 

ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని, క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Ugadi
Chebrolu
Pithapuram
Janasena

More Telugu News