PM Modi: ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు.. తెలుగులో ట్వీట్

Prime Minister Narendra Modi Ugadi Wishes In Telugu

  • అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఆకాంక్ష
  • పునరుత్తేజానికి ఉగాది నాంది పలుకుతుందన్న ప్రధాని
  • ఈ పండుగ ప్రజలకు శ్రేయస్సు కలిగించాలని కోరుకుంటున్నట్లు వెల్లడి

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ పునరుత్తేజాన్ని వెంట తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. పండుగకు సంబంధించిన ఓ కోట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల జీవితాల్లో అన్ని అంశాల్లోనూ కొత్త ఏడాది కొత్త సంతోషాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు.

More Telugu News