Lovers: మంత్రాలయంలో రైలుకిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

Lovers Committed Suicide In Mantralayam

  • కర్నూలులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నందిని
  • ఇంటర్ చదివి వ్యవసాయం చేస్తున్న చిన్న వెంకటేశులు
  • చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకున్న వైనం
  • ఉగాది పండుగ కోసం ఇంటికొచ్చిన నందిని 
  • ఆత్మహత్యకు తెలియని కారణం

ఆదోనిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంత్రాలయానికి చెందిన నందిని (20) కర్నూలులో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఉగాది పండుగ కోసం రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్న వెంకటేశులు (22) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు.  నందిని, చిన్నవెంకటేశులు ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆ పరిచయం వారితో పాటే పెరిగి ప్రేమగా మారింది. 

పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరన్న భయమో, మరోటో కానీ ఆదివారం అర్ధరాత్రి దాటి తర్వాత నందిని, చిన్నవెంకటేశులు ఇద్దరూ మంత్రాలయం-మటుమర్రి రైల్వే స్టేషన్ల మధ్య టీబీ వంతెన వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యతో ఇరువురి గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

Lovers
Love Couple
Kurnool District
Mantralayam
Andhra Pradesh
  • Loading...

More Telugu News