WhatsApp: కాంటాక్ట్ నంబర్లకు వాట్సప్ స్టేటస్‌ నోటిఫికేషన్లు.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది!

WhatsApp to bring new Notification feature

  • అందుబాటులోకి రాబోతున్న సరికొత్త ఫీచర్
  • కాంటాక్ట్స్‌లోని వ్యక్తులతో ఛాటింగ్ కోసమూ నోటిఫికేషన్లు ఉపయోగించుకునే అవకాశం
  • టెస్టింగ్ దశలో ఉన్న వాట్సప్ సరికొత్త ఫీచర్లు

యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్లు అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో సరికొత్త ఫీచర్‌ అందించేందుకు సన్నద్ధమవుతోంది. తన కాంటాక్ట్స్‌లోని సభ్యులతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుగా వాట్సప్ స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే వెసులుబాటును తీసుకురాబోతోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కాంటాక్ట్స్‌లోని సభ్యులు అందరి నుంచి స్టేటస్ నోటిఫికేషన్లు పొందవచ్చు. కాంటాక్ట్స్‌లో చూడని స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో అలెర్ట్ పొందొచ్చు. 

ఈ టెస్టింగ్ ఫీచర్ ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. వాట్సప్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే కొత్తగా తీసుకురానున్న ఫీచర్లలో స్టేటస్ అప్‌డేట్ ఉండనుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాంటాక్ట్స్‌లో తమకు నచ్చినవారితో చాటింగ్ కోసం కూడా నోటిఫికేషన్లు పంపించే ఫీచర్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ‘సజెస్టెడ్ చాట్’ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి రానుందని టెక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొత్త కాంటాక్టులతో చాటింగ్‌ను ఈ ఫీచర్ సులభతరం చేస్తుందని, యూజర్ల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత ప్రోత్సహిస్తుందని వాట్సప్ భావిస్తోంది. ఈ ఫీచర్ చాట్ లిస్టులో  దిగువన ఉండనుందని తెలుస్తోంది.

More Telugu News