CID: సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సీఐడీ వివరణ

CID explains why documents were burned

  • తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద కలకలం రేపిన పత్రాల దహనం
  • మండిపడిన టీడీపీ వర్గాలు
  • ఐదు కేసుల్లో కోర్టులో చార్జిషీట్లు వేశామన్న సీఐడీ
  • వేల సంఖ్యలో పత్రాలు ఉన్నాయని వెల్లడి
  • ఫొటోకాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పత్రాలు సరిగా ప్రింట్ కాలేదన్న సీఐడీ
  • అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలనే దహనం చేశామని స్పష్టీకరణ

తాడేపల్లిలో సిట్ కార్యాలయం పెద్ద సంఖ్యలో పత్రాలను దహనం చేసిన ఘటనపై టీడీపీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది. పత్రాలు దహనం చేయడంపై వివరణ ఇచ్చింది. 

ఐదు కేసులకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశామని, ఒక్కో చార్జిషీటులో 8 వేల నుంచి 10 వేల పేజీలు ఉన్నాయని సీఐడీ వెల్లడించింది. 

అయితే, ఫొటో కాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పేపర్లు ఇరుక్కుపోయి, సరిగా ప్రింట్ కాలేదని తెలిపింది. అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలను దహనం చేస్తామని సీఐడీ స్పష్టం చేశారు. ఆయా కేసులకు సంబంధించి ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

CID
Documents
Burning
SIT
Tadepalli
  • Loading...

More Telugu News