Allu Arjun: అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి, పవన్ కల్యాణ్

Birthday wishes pours on Allu Arjun

  • ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ 
  • సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
  • వినమ్రంగా బదులిచ్చిన బన్నీ
  • నేడు అకీరా, అఖిల్ సైతం పుట్టినరోజు జరుపుకుంటున్న వైనం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (ఏప్రిల్ 8) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్, నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. 

హ్యాపీ బర్త్ డే బన్నీ... ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.... పుష్ప2 టీజర్ చూశాను... జిగేల్మనిపించేలా ఉంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

హ్యాపీ బర్త్ డే బన్నీ అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్ అని పవన్ కొనియాడారు. అల్లు అర్జున్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. 

హ్యాపీ బర్త్ డే బావా అంటూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ఈ ఏడాది నీకు పూర్తిగా విజయాలు, సంతోషంతో నిండిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

ఇక, తనకు విషెస్ తెలిపిన వారందరికీ అల్లు అర్జున్ వినమ్రంగా బదులిచ్చారు. థాంక్యూ చిక్కా బాబాయ్ అంటూ చిరంజీవికి, థాంక్యూ కల్యాణ్ బాబాయ్ అంటూ పవన్ కు రిప్లయ్ ఇచ్చారు. థాంక్యూ బావా అంటూ జూనియర్ ఎన్టీఆర్ కు బదులిచ్చారు. 

ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది అల్లు అర్జున్ మాత్రమే కాదు... పవన్ కల్యాణ్ తనయుడు అకీరా, కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని కూడా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి... అకీరా, అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Allu Arjun
Birthday
Wishes
Chiranjeevi
Pawan Kalyan
Jr NTR
Akira
Akhil
Tollywood
  • Loading...

More Telugu News