CM Yogi Adityanath: ఉగ్ర‌వాదుల‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

UP CM Yogi Adityanath Fire on Congress

  • రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ 
  • ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని ధ్వ‌జం
  • ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగింద‌న్న‌ యోగి 
  • కాంగ్రెస్ పాల‌న‌లో ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు, విధానాలు లేవ‌ని మండిపాటు

రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగింద‌ని ఆయన అన్నారు. తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ముగిసిపోయాయ‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో పేద‌లు ఆక‌లితో అల‌మ‌టించారని, ఉగ్ర‌వాదుల‌కు మాత్రం బిర్యానీ పెట్టి పోషించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మోదీ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరుల‌కు ఉచిత రేష‌న్ అందిస్తోందని యోగి గుర్తు చేశారు. 

"ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద స‌మ‌స్య. ఆ పార్టీ పాల‌న‌లో ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు లేవు. ఎలాంటి విధానాలు లేవు. జ‌మ్మూకశ్మీర్‌పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టిక‌ల్ 370ని శాశ్వ‌తంగా ర‌ద్దు చేశాం. మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగింది. తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ముగిసిపోయాయి" అని సీఎం యోగి చెప్పుకొచ్చారు. ఇక మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలో కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు క‌నిపించ‌కుండా పోయాయ‌ని, మోదీ మాత్రం త‌న గురించి ప‌ట్టించుకోకుండా ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్ర‌మించార‌ని ప్ర‌శంసించారు.

  • Loading...

More Telugu News