Mani Bamma: వరసగా ముగ్గురిని పోగొట్టుకున్నాను: సీనియర్ నటి మణిబామ్మ

Mani Bamma Interview

  • సినిమాల్లో బిజీ అవుతున్న మణిబామ్మ 
  • టీచర్ గా పని చేశానని వెల్లడి 
  • భర్త మరణం కుంగదీసిందని వ్యాఖ్య 
  • కొడుకు మరణం పట్ల ఉద్వేగం   


ఆనందంగా సాగిపోతుందనుకున్న జీవితం ఒక్కసారిగా అగాధంలోకి జారిపోతుంది. కొండ చివరన తగిలించిన ఆశలన్నీ కుమ్మరించినట్టుగా కూలిపోతాయి. అలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడటం అంత మాషా మాషీ విషయమేం కాదు. కానీ నటిగా బిజీ అవుతున్న మణిబామ్మ మాత్రం వాటిని దాటుకుని వచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్లో మణిబామ్మ మెరుస్తూనే ఉన్నారు. 

తాజాగా ట్రీ మీడియావారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "మాది వ్యవసాయదారుల కుటుంబం. గుంటూరు ప్రాంతం నుంచి బెంగుళూరు వెళ్లి .. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. నా అసలు పేరు లక్ష్మీకాంతమ్మ .. కానీ అందరూ మణిబామ్మ అని పిలుస్తారు. ఇప్పుడు నాకు 70 ఏళ్ల పై మాటే. ఒకప్పుడు టీచర్ గా పనిచేసిన నేను, ప్రస్తుతం సినిమాల్లో బామ్మ పాత్రలను చేస్తున్నాను. సినిమా వాతావరణం చాలా సందడిగా ఉంటుంది .. నేను నా బాధలు మరిచిపోగలుతున్నాను" అని అన్నారు. 

నేను చాలా అదృష్టవంతురాలిని. మా పుట్టింటివారు గానీ .. అత్తింటివారు గాని నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు. కానీ మా వారు చనిపోవడం నన్ను కుంగదీసింది. నాకు ఇద్దరు కొడుకులు .. పెద్దబ్బాయి - కోడలు విజయవాడలో ఉంటారు. అనారోగ్య కారణాల వలన మా చిన్నబ్బాయి - కోడలు చనిపోయారు. మా వారు .. కొడుకు .. కోడలు పోవడం కంటే ఇంకా విషాదం ఏం కావాలి?  మా చిన్నబ్బాయి కొడుకుని చదివించుకుంటూ రోజులు గడుపుతున్నాను" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News