Janga Krishna Murthy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

MLC Janga Krishna Murthy joins TDP

  • వైసీపీ నుంచి టీడీపీలోకి పెరిగిన వలసలు
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీ బాట పడుతున్న వైనం
  • సత్తెనపల్లిలో జంగా కృష్ణమూర్తికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు 

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, రాష్ట్రాన్ని మళ్లీ గాడినపెట్టాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని అన్నారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందుకే తాను టీడీపీలో చేరుతున్నానని వెల్లడించారు. 

ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన నెలకొందని, ఇసుక, మైనింగ్ తో అక్రమార్కులదే రాజ్యం నడుస్తోందని జంగా కృష్ణమూర్తి విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా, పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు చక్కబడాలన్నా చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు.

Janga Krishna Murthy
TDP
Chandrababu
Sattenapalle
Praja Galam
Palnadu District
  • Loading...

More Telugu News