Solar Eclipse: మరో 2 రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం

Total solar eclipse 2024

  • మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటనున్న సూర్య గ్రహణం 
  • భారత్ సహా ఆసియాలో మాత్రం కంటికి కనిపించదు
  • లైవ్ స్ట్రీమింగ్ చేయనున్న నాసా

ఈ ఏడాది ఏప్రిల్ 8న అంటే మరో రెండ్రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ గ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరీబియన్ దేశాలు, మెక్సికో, స్పెయిన్, వెనెజువెలా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్ ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది. 

నాసా లెక్కల ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07 గంటలకు (పీడీటీ కాలమానం)కి కనిపిస్తుంది. ఆ తర్వాత మైన్ వద్ద సుమారు 01:30 గంటలకు (పీడీటీ) ముగుస్తుంది. 

ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ) ప్రకారం భారత్ లో 8వ తేదీ రాత్రి 9:12 గంటలకు మొదలై అర్ధరాత్రి దాటాక 02:22 గంటలకు ముగుస్తుంది. కానీ భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు. నాసాతో పాటు టెక్సాస్ లోని మెక్ డొనాల్డ్ అబ్సర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.

గ్రహణం... అపోహలు!

గ్రహణ సమయంలో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని.. అప్పుడు ఆహారం తింటే కల్తీ అవుతుందని పబ్లిక్ నమ్ముతున్నారు. కానీ గ్రహణ సమయంలో కొంత ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని స్టడీస్ చెబుతున్నాయి. చాలా మంది గ్రహణం విడిచాక మిగిలిన ఆహారాన్ని పడేస్తారు. నాసా చెప్పే దాని ప్రకారం... గ్రహణం వేళ ఏర్పడే రేడియేషన్ ఆహారంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లోని ఉప్పు, పప్పులపైనా, పంట పొలాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందట.

Solar Eclipse
India
USA
NASA
  • Loading...

More Telugu News