Cantonment by poll: కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్
![Sri Ganesh is the Congress candidate for Secunderabad Cantonment by poll](https://imgd.ap7am.com/thumbnail/cr-20240406tn661109a6d841d.jpg)
- శ్రీగణేష్ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
- ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నిక
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం తన అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శ్రీగణేష్ పేరును ఖరారు చేశారు. కాగా, శ్రీగణేష్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన లాస్య నందిత గెలిచారు. కానీ, ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది.