Revanth Reddy: ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేశ్‌తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy at Uppal Stadium to see ipl match

  • కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చిన రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డిని చూసి సీఎం... సీఎం అంటూ నినాదాలు 
  • మ్యాచ్ తిలకిస్తోన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ తిలకిస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి రావడాన్ని చూసిన పలువురు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం... సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మ్యాచ్ చూసేందుకు ముఖ్యమంత్రి రావడంతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పక్కనే నటుడు వెంకటేశ్ కూర్చొని మ్యాచ్ తిలకిస్తున్నారు. మ్యాచ్ చూస్తున్న వారిలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ను ప్రారంభించింది.

Revanth Reddy
Venkatesh Daggubati
IPL 2024
Cricket
  • Loading...

More Telugu News