Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

BJP MLA Maheswar Reddy challenges congress

  • తెలంగాణలో తాము 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటామని మహేశ్వర్ రెడ్డి ధీమా
  • రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
  • పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పంటనష్టం అందించడం లేదని విమర్శ
  • రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపాటు

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్ రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో తాము పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పంటనష్టం అందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా అమలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు.

Alleti Maheshwar Reddy
BJP
Congress
Lok Sabha Polls
  • Loading...

More Telugu News