Pawan Kalyan: శాంతిస్వరూప్ కన్నుమూతపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan reacts on news reader Shanti Swaroop demise
  • తెలుగులో తొలి న్యూస్ రీడర్ గా ఖ్యాతి పొందిన శాంతి స్వరూప్
  • గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూత
  • దూరదర్శన్ వార్తలంటే ఆయనే గుర్తుకు వస్తారన్న పవన్

తెలుగు బుల్లితెర రంగంలో తొలి న్యూస్ రీడర్ గా ఖ్యాతి పొందిన శాంతిస్వరూప్ కన్నుమూశారు. రెండ్రోజుల కిందట గుండెపోటుకు గురైన శాంతిస్వరూప్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శాంతిస్వరూప్ మరణంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

"టీవీలో తొలిసారి తెలుగు వార్తలు చదివిన శాంతి స్వరూప్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. శాంతి స్వరూప్ గారు వార్తలు చదివే విధానం, పదాలను స్పష్టంగా పలకడం వీక్షకులను మెప్పించాయి. దూరదర్శన్ వార్తలంటే ఆయనే గుర్తుకు వస్తారు. ఈ విషాద సమయంలో శాంతి స్వరూప్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.
Pawan Kalyan
Shanti Swaroop
News Reader
Demise
TV News
Doordarshan
Telugu News

More Telugu News