Chandrababu: వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు: చంద్రబాబు

Chandrababu alleges YCP leaders put pressure on Volunteers
  • ఏపీలో పెన్షన్ల దుమారం
  • పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందన్న చంద్రబాబు
  • పెన్షన్లపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం 
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. 

వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.  తండ్రి వైఎస్, బాబాయ్ వివేకా చనిపోయినప్పుడు జగన్ రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ శవరాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu
Volunteers
Pensions
TDP
YSRCP

More Telugu News