Mallu Bhatti Vikramarka: మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Police search in Mallu Bhattivikramarka vehicle
  • లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
  • అందరి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులు, ఎన్నికల సిబ్బంది
  • మధిర మండలం ఆత్కూర్ క్రాస్ వద్ద భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో పోలీసులు అందరి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధిర మండలం ఆత్కూర్ క్రాస్ వద్ద భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం ఆపి తనిఖీలు పూర్తయ్యే వరకు భట్టివిక్రమార్క వాహనంలో కూర్చొని సహకరించారు. కారు వెనుక భాగం సహా అంతా తనిఖీ చేశారు. సహకరించినందుకు ఉపముఖ్యమంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
Mallu Bhatti Vikramarka
Congress
Lok Sabha Polls

More Telugu News