Pushpa-2: పుష్ప-2 మ్యూజిక్ సెషన్స్ లో త్రిమూర్తులు... ఈ నెల 8న అదిరిపోయే ట్రైలర్ కు రంగం సిద్ధం

Music sessions for Pushpa2

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2
  • సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్
  • ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప-2. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ చిత్రం కోసం సంచలన నేపథ్య సంగీతానికి రూపకల్పన చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ బీజీఎంను ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యే టీజర్ లో వినొచ్చని వివరించింది. 

అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్... ఈ త్రిమూర్తుల కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడా మ్యాజిక్ రిపీట్ అవడం ఖాయమని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. 

ఈ చిత్రంలో రష్మిక కథానాయిక కాగా, పుష్పలో చివర్లో వచ్చిన ఫహాద్ ఫాజిల్ ఈసారి సినిమా అంతా సందడి చేయనున్నాడు. పుష్ప-2 చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

More Telugu News