: మోకా కోర్టులో నేడు శ్రీశాంత్ బెయిల్ పై విచారణ


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు శ్రీశాంత్, బుకీ జీజు జనార్ధన్ ల బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీలోని 'మోకా' (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కోర్టులో విచారణ జరగనుంది. అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటయిన 'మోకా' ను ఈనెల 3న శ్రీశాంత్, అజిత్ ఛండీలా, అంకిత్ ఛవాన్ లపై ప్రయోగించారు. కాగా, కొన్నిరోజుల కిందట వీరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు ఈనెల 18 వరకు జ్యుడీషియల్ కష్టడీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News