IPL 2024: ఇషాంత్ శ‌ర్మ క‌ళ్లు చెదిరే యార్క‌ర్‌.. క్రీజు వ‌దిలి వెళుతూ, అభినందించిన‌ ఆండ్రీ ర‌సెల్‌!

Ishant Sharma Dismantles Andre Russell Stumps With Yorker

  • క‌ళ్లు చెదిరే యార్క‌ర్ డెలివ‌రీతో ర‌సెల్‌ను బోల్తా కొట్టించిన ఇషాంత్ శ‌ర్మ‌
  • ఇషాంత్ యార్క‌ర్‌ దెబ్బ‌కు కిందపడిన రసెల్  
  • వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌లో ఘ‌ట‌న‌

వైజాగ్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ ఓ క‌ళ్లు చెదిరే యార్క‌ర్ డెలివ‌రీతో బ్యాట‌ర్ ఆండ్రీ ర‌సెల్‌ను బోల్తా కొట్టించాడు. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో బంతి వికెట్ల‌ను గిరాటు వేయ‌డంతో క‌రేబియ‌న్ ఆట‌గాడు నిర్ఘాంత‌పోయాడు. ఇషాంత్ యార్క‌ర్‌ దెబ్బ‌కు రసెల్ కింద‌ప‌డ్డాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్ మొద‌టి బంతికి ఇలా ఆండ్రీ ర‌సెల్‌ను క‌ళ్లు చెదిరే యార్క‌ర్‌తో ఇషాంత్ బోల్తా కొట్టించాడు. ఇక ఔట‌యిన త‌ర్వాత క్రీజు వ‌దిలి వెళ్తున్న క్ర‌మంలో ర‌సెల్‌.. ఇషాంత్‌ను అభినందిస్తూ వెళ్లాడు. 

అయితే, అప్ప‌టికే ర‌సెల్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 19 బంతుల్లోనే 41 ర‌న్స్ బాదాడు. ఈ తుపాన్ లాంటి ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే రెండో అత్య‌ధిక స్కోర్ (272) న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని కేకేఆర్ 106 ప‌రుగుల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. అలాగే వ‌రుస‌గా మూడో విజ‌యాన్ని సాధించిన కోల్‌క‌తా పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానానికి ఎగ‌బాకింది.

IPL 2024
Ishant Sharma
Andre Russell
KKR
DC
Cricket
Sports News

More Telugu News