Love Marriage: స్పెయిన్ అబ్బాయిని పెళ్లాడిన తెలుగు అమ్మాయి!

Telugu Girl Married Spain Man

  • స్పెయిన్‌కు చెందిన మార్క్ మ‌న్‌సిల్లాను ప‌రిణ‌య‌మాడిన స‌త్తుప‌ల్లికి చెందిన లావ‌ణ్య‌
  • స్పెయిన్‌లో ఒకే సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ప‌ని చేస్తున్న వ‌ధూవ‌రులు
  • త‌మ ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌జేసి.. వారి అంగీకారంతోనే పెళ్లి బంధంతో ఒక్క‌టయిన వైనం

తెలుగు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన లావ‌ణ్య‌, స్పెయిన్‌కు చెందిన మార్క్ మ‌న్‌సిల్లా ప్రేమించుకున్నారు. ఒకే సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ప‌ని చేస్తున్న వీరు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్రేమ విష‌యం తెలియ‌జేసి, వారిని ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. 

స‌త్తుప‌ల్లికి చెందిన విద్యాభార‌తి క‌ళాశాల డైరెక్ట‌ర్ మంద‌డ‌పు స‌త్య‌నారాయ‌ణ‌, సుజ‌ని దంప‌తుల కుమార్తె లావ‌ణ్య‌. స్పెయిన్‌లోని అవిన్‌గూడ బార్సిలోనాకు చెందిన మారియానో మ‌న్‌సిల్లా, ఎమిలియా దంప‌తుల కుమారుడు మార్క్ మ‌న్‌సిల్లా. వీరిద్ద‌రూ ఒకేచోట ప‌నిచేస్తుండ‌డంతో మ‌న‌సులు క‌లిశాయి. 

పెద్ద‌లు కూడా వీరి ప్రేమ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో బుధ‌వారం స‌త్తుప‌ల్లిలోని సాయిబాలాజీ ఫంక్ష‌న్ హాలులో లావ‌ణ్య‌, మ‌న్‌సిల్లా వివాహం బంధువులు, స్నేహితుల మ‌ధ్య‌ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా హాజ‌ర‌య్యారు.

More Telugu News