Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై నెటిజన్ల ఆగ్రహం... ఎందుకంటే...!

Netizens fires on Vijay Devarakonda

  • విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్
  • ఏప్రిల్ 5న రిలీజ్
  • ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మరం
  • ఓ ప్రమోషన్ ఈవెంట్ వద్ద అభ్యంతకర పదం వాడిన విజయ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఓ బైక్ పై వచ్చారు. అయితే, బైక్ వచ్చే మార్గంలో ఎదురుగా కొందరు ఉండడంతో... విజయ్ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఓ అభ్యంతరకర పదం ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ నోట బూతు మాట రావడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

More Telugu News