Dr Suneetha: ఆ సినిమా చివరి అరగంట చూడలేక కళ్లు మూసుకున్నాను... 'వివేకం' సినిమాపై సునీత స్పందన

Dr Suneetha talks about Vivekam movie

  • 2019లో సంచలనం సృష్టించిన వివేకా హత్య
  • వివేకం పేరుతో యూట్యూబ్ లో ఓ సినిమా రిలీజ్
  • ఆ చిత్రాన్ని చాలా ధైర్యంగా తెరకెక్కించారన్న సునీత 

మాజీ ఎంపీ వివేకా హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన 'వివేకం' అనే చిత్రం ఇటీవల యూట్యూబ్ లో విడుదలైంది. టీమ్ ఎస్ క్యూబ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మిలియన్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి స్పందించారు. 

"అది సినిమా అనాలో, డాక్యుమెంటరీ అనాలో నాకు తెలియదు. ఎవరు తీశారో, ఎప్పుడు తీశారో గానీ... చాలా ధైర్యంగా తీశారు. అందులో చూపించిన వ్యక్తిగత అంశాల పట్ల కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ... ఆ సినిమాలో చివరి అరగంట చూడ్డానికి నాకే భయం వేసింది. చూడలేక కళ్లు మూసుకున్నాను. వాస్తవంగా జరిగిన ఉదంతంతో పోల్చితే ఆ సినిమాలో చాలా లైట్ గా చూపించారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అది చూస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారేమో కానీ, నాకు మాత్రం చాలా బాధేసింది" అని వివరించారు.

More Telugu News