Pushpa-2: పుష్ప-2 నుంచి మాస్ జాతరకు ముహూర్తం ఖరారు... ఏప్రిల్ 8న గ్రాండ్ టీజర్

Pushpa 2 teaser will out on April 8

  • పుష్ప-2తో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు అల్లు అర్జున్, సుకుమార్ రెడీ
  • ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే... అభిమానులకు కానుక
  • ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప: ది రూల్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటినుంచే పుష్ప-2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 

ఈ నేపథ్యంలో, పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ చిత్రం నుంచి ఇవాళ తాజా కబురు వచ్చింది. ఈ సినిమా నుంచి గ్రాండ్ టీజర్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం నేడు ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, అభిమానులకు అదిరిపోయే టీజర్ ను కానుకగా అందిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న పుష్ప-2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa-2
Teaser
Allu Arjun
Sukumar
Tollywood

More Telugu News