Nizamabad District: నిజామాబాద్‌లో భారీగా నగదు, బంగారం పట్టివేత

Police Seize Gold And Cash In Nizamabad

  • ఓ వ్యక్తి నుంచి రూ.6.89 లక్షల నగదు, 400 గ్రాముల పసిడి పట్టివేత
  • మొత్తం విలువ రూ. 34.89 లక్షలు ఉంటుందని అంచనా
  • ఎన్నికల నేపథ్యంలో తనిఖీల ముమ్మరం

ఎన్నికల వేళ నిజామాబాద్‌ లో భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. స్థానిక ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్‌బాబు ఆధ్వర్యంలో గతరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాందేవ్‌వాడకు చెందిన యువకుడు గంగా ప్రసాద్ నుంచి రూ. 6.89 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ రూ. 34.89 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఇటీవల కూడా నిజామాబాద్‌లో భారీగా నగదు పట్టుబడుతోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు డబ్బును పెద్ద మొత్తంలో తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేశారు.

Nizamabad District
Election News
Telangana
  • Loading...

More Telugu News