Kuwait: భూమిపై నూకలు మిగిలుండటమంటే ఇదేనేమో.. వైరల్ వీడియో!
- కువైట్‌లో ఒళ్లు గగుర్పొడిచే కారు ప్రమాదం
- బీచ్‌లో పల్టీలు కొట్టిన కారు.. చిన్నపాటి గాయాలతో బయటపడ్డ వ్యక్తి
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
కొన్ని ప్రమాదాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ, అలాంటి ప్రమాదాల నుంచి కూడా కొందరు చిన్నపాటి గాయాలతో బయటపడుతుంటారు. అలాంటి వారికి ఇంకా భూమిపై నూకలు మిగిలున్నాయని పెద్దలు చెబుతుంటారు. ఇదిగో అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి గల్ఫ్ దేశం కువైట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ వ్యక్తి బీచ్‌లో కారు డ్రైవింగ్ చేసుకుంటూ రావడం మనం వీడియోలో చూడొచ్చు. అయితే, మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పి గాల్లోనే మూడునాలుగు పల్టీలు కొట్టి తర్వాత కింద నీటిలో పడింది. అలా కారు గాల్లో పల్టీలు కొట్టే క్రమంలోనే అందులో ఉన్న వ్యక్తి ఎగిరి సముద్రంలో పడటం వీడియోలో ఉంది. అలా అతడు కారులోంచి నీటిలో పడి, అక్కడి నుంచి మాములుగా నడుచుకుంటూ బీచ్ ఒడ్డుకు రావడం మనం చూడొచ్చు.
ఇంతపెద్ద ప్రమాదంలోంచి కూడా అతడు చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. అయితే, ఇది ఎప్పుడు జరిగిన ప్రమాదం అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం తాలూకు వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరు వీడియోపై ఓ లుక్కేయండి.